కంటి వెలుగును ప్రారంభించనున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌

అక్టోబరు 10న అనంతపురంలో వైయస్సార్‌ కంటి వెలుగును ప్రారంభించనున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌
*రేపు ఉదయం రాజమండ్రిలో వివాహ కార్యక్రమానికి సీఎం హాజరు.


అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపట్టిన మరో కార్యక్రమం 'వైయస్సార్‌ కంటి వెలుగు'ను ఈనెల 10వ తేదీన అనంతపురంలో ప్రారంభించనున్నారు. అనంతపురం జూనియర్‌కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ హాజరవుతారు. వరల్డ్‌ సైట్‌ డే సందర్భంగా ప్రజలందరికీ ఉచితంగా పరీక్షలు, వైద్యసేవలు, కంటికి శస్త్రచికిత్సలు వైయస్సార్‌ కంటివెలుగు కింద లభిస్తాయి. 6 విడతలుగా మూడేళ్లపాటు ఈకార్యక్రమం అమలవుతుంది. అక్టోబరు 10, ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అనంతపురం జూనియర్‌కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరై వైయస్సార్‌ కంటి వెలుగును ప్రారంభిస్తారు. 


రేపు ఉదయం రాజమండ్రిలో వైయస్సార్‌సీపీ నేత శివరామసుబ్రహ్మణ్యం కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ హాజరు కానున్నారు.